Syria: సిరియాలో కొనసాగుతున్న మారణ హోమం..! 1 y ago
సిరియాలో మారణ హోమం ఆగట్లేదు. దేశం విడిచి పారిపోయిన మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారులు, ఇస్లామిక్ గ్రూప్‌ల మధ్య వైరం నడుస్తోంది. ఈ క్రమంలో జబ్లే పట్టణంలో అసద్ విధేయులు దాడులు నిర్వహించారు. ఇందులో 16 మంది మృతి చెంది ఉంటారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. ప్రతిగా భద్రతా దళాల కాల్పుల్లో 28 మంది అసద్ విధేయులు, 3 పౌరులు, 13 మంది పోలీసులు చనిపోయినట్లు వెల్లడించింది.